Monday, December 05, 2011

Judiciary Commission

Judiciary Commission

మన దేశం లో కెల్లా పరమ wrost రాష్ట్రాలు ఏమిటి అని ఎవ్వరిని అడిగితె మొదటే చెప్పేది Behar , ఉత్తర ప్రదేశ్ ఎందుకనగా అక్కడ ప్రధానంగా judiciary అనగా న్యాయవావస్థ  అనేది పరమ చండాలంగా ఉన్నది. భవిష్యత్ లో మన ఆంధ్ర కూడా మరొక బీహార్ లాగా అవుతుంది ఎందుకనగా
  1. న్యాయవ్యవస్థ చాల చాల ఆలస్యంగా ఉన్నది అనగా ఆమధ్య సుప్రేం కోర్ట్ judge K G Balakrishnan గారు  అన్నారు " ప్రస్తుతం ఉన్న విధానమే కొనసాగితే  ప్రస్తుతం ఉన్న 3  కోట్ల 80 లక్షల కేసు లను పూర్తి చేయటానికి కనీసం 320 సంవత్సరాలు అవుతుంది అని" అన్నారు
  2. ఎందుకనగా ఉదాహరణకు మన hyderabad లో ameerpet లో big bazar ప్రక్కన ఉన్న ఖాళీ స్తలం ఉన్నది అది గుంటగా తీసి ఆపివేసినట్లు ఉన్నారు . నేను దానిని గత  ఐదు సంవస్తరాలు క్రితం చూసాను . ఇప్పటికి అలాగే ఉంది ఎందుకు అని ప్రక్కవాళ్ళను  అడిగితె అది కోర్ట్ లో నడుస్తుంది అని అన్నారు. అంటే ఈ కేసు పూర్తి  కావాలంటే కనీసం మరొక 20 సంవత్సరాలు అవుతుంది . ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చిన్న కేసు ను పూర్తి చేయాలంటే అందుకు కనీసం 10  సంవత్సరాలు అవుతుంది . అంత ఎందుకు సాక్షాత్తు ACB redhanded  గ పట్టుకున్నా అది నిరూపించి వాయిదాలు పడి తేర్పు రావాలంటే కనీసం 5 సంవత్సరాలు అవుతుంది. అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద case పూర్తి కావాలంటే కనీసం 20 సంవత్సరాలు అవుతుంది. 
  3. అంతెందుకు దాదాపు నేను పుట్టినప్పుడు జరిగిన సంఘటన 1984 decembar 3 న BHOPAL లో MIC గ్యాస్ బయటకు లీక్ కావటం వాళ్ళ కొన్ని వేల మంది చనిపోయారు ఇప్పటికి కొన్ని లక్షలమంది అంతుచిక్కని వ్యాధులతో ఇప్పటికి బాధపడుతున్నారు . అప్పుడు court లో కేసు వేస్తె గత సంవస్తరం 2010 june 7 న అక్కడి కోర్ట్ తీర్పు ను ఇచ్చినది . అది మల్లి సుప్రేం కోర్ట్ కు వెళ్ళినది అక్కడ తీర్పు రావటానికి మరొక 25 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి ఈ బాధితులు అందరు చచిపోతారు .



    వాళ్ళు చచిపోయిన తర్వాత వాళ్ళకు నష్టపరిహారం ఇచి ఏమి ప్రయోజనం ? ఆ డబ్బు ను మల్లి వచ్చే జన్మకు deposit చేసుకుంటారా ? పైగా అప్పుడు ఆ లీక్ కు కారణం ఐన వాళ్ళు చాల వరకు చనిపోయారు . బ్రతికి ఉన్నవాళ్లు అందరు bail తెసుకొని బయట ప్రశాంతం గ ఉన్నారు . అంటే వాళ్ళకు శిక్ష పడేసరికి మరొక పాతిక సంవత్సరాలు పడుతుంది అప్పటికి వీళ్ళు అందరు నిందుతులు చనిపోతారు అప్పుడు ఆ చనిపోయినవారి శవాలను జైలు లో ఉంచుతారా?
  4. అంత ఎందుకు (ప్రక్క video లో చుడండి ) కేరళ లో ఎప్పుడో ఇరవయి సంవత్సరాల క్రితం ఒక మంత్రి కుంబకోణం జరిగితే అది 2011 febravary 19 తీర్పు  వచ్చి అతనుజైలు కు వెళ్ళాడు.  అది కూడా అప్పుడు ఒక సాదారణ సంగం కేసు వేస్తె అది ఇప్పటికి తేర్పు వచ్చినది అది కూడా ప్రతిపక్షం లో ఉన్న CM special court ఏర్పాటు చేసి త్వరగా చేయమన్నందుకు ఆ తేర్పు లేక పొతే అది మరొక 10 సంవత్సరాలు పడుతుంది అప్పటికి అతను చనిపోయి ఉండేవాడు .
  5. అంత ఎందుకు 24 feb 2010 న చీరాల MLA తమ్ముడు ఇలాంటి settlement చేస్తున్నాడు అని వీడియో సాక్షాలతో ఒకతను case వేసాడు  ఆ కేసు ఏమిటంటే అతను వాళ్ళ అన్న ఆస్థి సమస్య వాళ్ళ నాన్న 2 కోట్ల ఆస్తిని అన్నకే రాసి ఇచారు కాబట్టి ఆ తమ్ముడు స్తానికంగా ఉన్న MLA తమ్ముడి దగ్గరకు వెళ్లి settlement చేపించమని అడిగాడట ఆ MLA తమ్ముడు సెట్ట్లేమేంట్ చేస్తుంటే ఆ రెండుకోట్లు ఉన్న అన్న human rights ను ఆశ్రయించాడు . కానీ ఆ తీర్పు రావాలంటే కనీసం మరొక 20 సంవత్సరాలు అవుతుంది ఆ అన్న తమ్ముల ఆస్తుల కేసు ఐన ఈ settlement case ఐన.          
  6.  అంత ఎందుకు బోఫోర్స్ నుండి 2 G వరకు ఎన్ని కుంభకోణాలు   జరిగినాయి అందులో కనీసం ఒక్క కేసు లో ఐన తీర్పు వచ్చినదా? రాదు అంటే ఏమి జరుగుతుంది చేడువారికి శిక్ష పడటంలేదు మంచివారికి న్యాయం చాల చాల late గా జరుగుతుంది (అనగా ఒక ఇరవయ్ సంవస్తరాల తర్వాత ) అంత లేట్ గ న్యాయం జరిగినా అది అన్యాయమే అవుతుంది. మన రాజ్యాంగం 100 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక్క నిర్దోసికి శిక్ష పడకూడదు అంటారు కానీ ఇప్పుడు అది తప్పు చేసినవాడికి bonus (bail తీసుకోని happy గ ఉండటం ) మంచివాడికి చాల చాల లేట్ గ న్యాయం లాగా ఉన్నది.    అందుకే అది భరించలేని అనేక మంది ప్రధానం గా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కోర్ట్ లో మనకు న్యాయం జరగటం లేదు అని వాళ్ళకు నచ్చిన న్యాయం వాళ్ళే చేస్తున్నారు . అందుకే అక్కడ నేను బీహార్ లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తున్నాను.
    బీహార్ లో నేను గమనించిన విషయాలు :
  7. అక్కడ ఎవరు కోర్ట్ కు వెళ్లరు ఎందుకు అంటే అక్కడకు వెళితే కనీసం 10 సంవత్సరాలు అవుతుంది అప్పటివరకు వాళ్ళు  వేచి ఉండలేరు. అందుకే అక్కడ రైతులు ఎవరైన పొలంలో  మోర్టర్ లో దొంగతనం చేస్తే అక్కడ కళ్ళు పీకివేయటం లేదా ఒక చెట్టుకు కట్టివేసి పైన ఉన్న తేనతోట్టే ను లేపి ఆ తేనటిగలు అతనిని కుట్టేలగా చేయటం . ఒక చేయి లేదా కాలు లేకుండా చేయటం వంటివి చేసారు. అది అక్కడ NYK వాళ్ళు నాకు చెప్పారు. అదే ఇక్కడ మన రాష్ట్రము లో ఐతే మహా ఐతే తిడతారు police station లో కేసు వేసినా ఆ దొంగ bail తెసుకొని దర్జాగా బయట తెరుగుతాడు
  8. బీహార్ లో ఈ టౌన్ లోనే ఒక అమ్మాయి దగ్గర లో ఉన్న MLA కొడుకు ను చంపివేసినది అంట ఎందుకు అంటే అతను (MLA కొడుకు ) ఆ అమ్మాయి ని రేప్ చేసాడంట ఆమె కోర్ట్ కు వెళ్ళితే వాడు bail తెసుకొని వస్తాడు మల్లి నాముందే తెరుగుతుంటే నేను భరించలేను అందుకే అతనిని చంపివేసి అదే bail ఆమె తెసుకొని ఇప్పుడు బయటకు తెరుగుతుంది . ఇంకా ఆ case పెండింగ్ లో ఉన్నది
  9. ఇలా కోర్ట్ లో లేట్ అవుతుందని ఒక బాధ ఐతే మరొక బాధ ఏమిటంటే దేనిని ఆసరాగా తెసుకొని కొన్ని మాఫియా లు అక్కడ గ్రామా గ్రామాన ఉన్నాయి అనగా బీహార్ లో ప్రతి గ్రామానికి ఒక్క settlement చేసేవాడు ఉంటాడు . అక్కడ court కు వెళ్ళకుండా ఈ settlement వదిదగ్గరకు వెళ్ళితే త్వరగా తీర్పు వస్తుంది . అని అందరు ఇతనిదగ్గరకు వస్తాడు అందుకు అతనికి 5 % నుండి 30 % commission తెసుకుంటాడు.
  10. ఉదాహరణకు పైన చెప్పిన ఆమంచి MLA settlement విషయం లో స్తలం విషయం కు వస్తే ఆ అన్న తమ్ముడు దగ్గరలో ఉండే settlement వాడి దగ్గరకు వెళితే అతను తీర్పు  చెప్తాడు అనగా ఆ స్తలం 2 కోట్లు అందులో 1 కోటి  అన్న కు 1 కోటి  తమ్ముడికి ఇస్తాడు( ఇదికాదు అంటే అన్నవాడి కొడుకు నో కూతురునో కిడ్నాప్ చేసి బెదిరించటం వంటివి మాములే) సెట్ట్లేమేంట్ చేసినందుకు అతనికి కనీసం 10 % అంటే అటు 10 % ఇటు 10 % మొత్తం కనీసం 20 లక్షలు settlement చేసినందుకు అతనికి వస్తాయి. ఆ డబ్బు తో ఆ settlement మాఫియా ఇంకా రేచిపోతుంది ఇలా బీహార్ లో ఈ settlement వ్యవస్థ మూడు పువ్వులు ముఫై కాయలు గ ఉన్నది మన ఆంధ్ర ఏమి తక్కువేమీ కాదు ప్రస్తుతం అన్ని మునిసిపల్ పట్టణాలలో స్తానిక MLA నో లేక MP నో ఎవరో ఒకరు సెట్ట్లేమేంట్ వాడు ఉంటాడు. నాకు తెలిసి హైదరాబాద్ లో ప్రతి గల్లి గాలికి వార్డ్  వార్డ్ కు ఒక settlement అతను ఒకడు ఉంటాడు అందుకు నేను guarentee .
  11. ఈ బీహార్ లో తెలివితేటలను చేడుకోసం ఉపయోగించుకుంటున్నారు  ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేక పోత్తకుటికోసం అనేకమంది వాళ్ళ తెలివితేటలను చేడుకోసం ఉపయోగించుతున్నారు . అనగా నేను ప్రత్యక్షం గ చూసినది . విన్నది నేను ఇక్కడ NYK ఆఫీసు లో ఎయిడ్స్ వాళ్ళు వస్తే అక్కడ విన్నాను ఇది . అక్కడ ఎవరిని ఐన చంపాలంటే పెద్దగ కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఐన చంపల్సివస్తే దగ్గరలోని settlement వాడికి చెప్తే చాలు ఆ సెట్ట్లేమేంట్ అతను ఒక ఎయిడ్స్ రోగిని పిలిపించి ఎవరిని ఐతే చంపాలో అతనిని చూపించి అతనిని  చంపితే నీకు ఒక లక్ష ఇస్తాను అంటే ఆ ఎయిడ్స్ రోగి ఎలాగో రేపో మాపో చచేవాడిని కదా వాడిని చంపితే ఈ డబ్బుతో మా ఇంట్లో పిల్లలు బాగుంటారు అని అతనిని చంపివేస్తాడు . ఒకవేళ అతనిమీద కేసు రుజువు ఐన అతనికి శిక్ష పడేసరికి 10 సంవత్సరాలు అవుతుంది అప్పటికి ఈ ఎయిడ్స్ రోగి చనిపోతాడు . ఇలా న్యాయం చాల లేట్ గ జరగటం వాళ్ళ వాళ్ళు కోర్ట్ కు వెళితే చాల లేట్ గ జరుగుతుందని ఇలా చెడు మర్గాలలోకి వెళుతున్నారు.   
  12. అందుకే బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇవి మొత్తం ఆలోచించారు కాబట్టే అక్కడ పైన చెప్పినట్లు చంపుకోవటాలు చావటాలు చూడలేక తట్టుకోలేని వాళ్ళు అంతా ప్రక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఇవి నేను స్వయంగా బీహార్ లో వారం రోజులలో గమనించిన విషయాలు. ఇంకా నేను పూర్తిగా తెలుసుకోలేదు అక్కడ ఏమి జరుగుతున్నవో.
  13. krishna ayer
    justice venkatachalaiah
    JS Varma
  14. ఇక నేను పూర్తిగా తెలుసుకుందాం ఈ న్యాయ వ్యవస్థ గురించి అని ఆంధ్రకు వచ్చి తెల్సుకున్నాను ఈ judiciary వ్యవ్యస్థ గురించి . అందులో బాగంగా loksatta group లోని ప్రధాన సబ్యులు ఐన  justice venkatachalaiah గారు మరియు J S Verma గారు మరియు justice krishna iyer గారు  తయారుచేసిన judiciary commission ఒక్కటే మార్గం ఈ అన్ని సమస్యను తెర్చటానికి అని తెలుసుకున్నాను.ఎందుకు అనగా నేను గతం లో నే చెప్పాను మనం పోరాడాల్సింది వ్యవస్థ మీద అంటే కానీ వ్యక్తులమీద కాదు అని  ఈ bill లో కుడా అదే ఉన్నది అంటే న్యాయ వ్యవస్థ మీద పోరాడే bill ఇది

      ఈ bill కూడా janlokpall bill లో ఉన్నది. దీని ముక్యమైన ఉద్యేశ్యం సాదారణ case లు అన్ని 100 రోజులలో తీర్పు రావాలి. పెద్ద కేసులు అన్ని గరిష్టంగా 6 నెలలలో తీర్పు రావాలి లేటు అవుతున్నది అంటే అందుకు special court ను ఏర్పాటు చేయాలి. అవినీతి వంటి కేసు లలో సాద్యమైనంత త్వరగా తీర్పు రావటానికి special court (CBI అండ్ ACB కోర్ట్ లు ) లు ఏర్పాటు చేయాలి. అల చేస్తే గతం లో kg balakrishnan గారు అన్నట్లు  ప్రస్తుతం ఉన్న 3 కోట్ల 80 లక్షల case లు పూర్తిగా పరిష్కరించటానికి 320 సంవత్సరాలు అవసరం లేదు ఒక్క 5 సంవత్సరాలు చాలు. ఈ judiciary commission గురించి మరియు ప్రస్తుతన్యాయ వ్యవస్థ లోని మనకు ఉపయోగపడే మార్గాలు  నేను కొన్ని రోజులతర్వాత పోస్ట్ లో వ్రాస్తాను.

    ఇట్లు
మీ Venu A+ve 22+

    No comments: