నేత్రదానం
మన దేశం లో నేత్రదానం చేయకపోవటం వల్ల నష్టాలు జరగటం లేదు . కానీ నేత్రదానం మీద సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ అనర్దాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేత్రదానం చేయకపోతే ఇప్పుడు మాత్రమే నష్టం కానీ దాని గురించి తెలుసుకోక పొతే మళ్ళి వచ్చే తరం ఆ తర్వాత తరం అన్ని అలాగే ఉంటాయి కాబట్టి తర తరాలు నష్టం కలగటానికి ఇది ప్రధాన కారణం అందుకు అందరికి అవగాహన కలిగించాలి అని నా ప్రయత్నం లో భాగమే ....
- అన్నదానం, విద్యాదానం, శ్రమదానం, కన్యాదానం, రక్తదానం ఇలా ప్రపంచం లో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి కానీ స్వార్ధం అంటూ ఎరుగని ఎకైక దానం నేత్రదానం.
- నేత్రదానం అనేది 1 సంవత్సరం నుండి వందసంవత్సరాల పైబడినవారు కూడా చేయగల ఏకైక దానం నేత్రదానం.
- నేత్రదానం అంటే కళ్ళు మొత్తం స్వీకరించరు కేవలం కంటి పైన గల cornea అనే ఒక్క పొర మాత్రమే స్వీకరిస్తారు. నేత్రదానం తర్వాత కళ్ళు తెయ్యకమునుపు వలె మాములు గా ఉంటాయి .
- నేత్రదానం చేయటానికి ప్రత్యేకమైన అర్హతలు ఏమి లేవు ఆరు నెలల నుండి 100 సంవస్తరాలకు పైబడి ఉన్న వాళ్ళు, ఆపరేషన్ చేసిన కళ్ళు గల వాళ్ళు సుక్లాలు ఉన్నవారు సైతం నేత్రదానం చేయవచ్చు. నేత్రదాత మరణించిన తర్వాత దగ్గరలోని నేత్రనిదికి ఫోన్ చేస్తే చాలు. ఒక నేత్రదాత కళ్ళను ఇద్దరు అందులకు అమరుస్తారు
- నేత్రాలను నేత్రదాత మరణించిన 6 నుండి 8 గంటలలోపు మాత్రమే నేత్రాలను స్వేకరించావాలను అందుకు నేత్రదాత మరణించిన వెంటనే దగ్గరలోని eyenank కు సమాచారం ఇవ్వాలి.
- కారణాలు ఏమైనా ఎలాంటి పరిస్తుతులలో ఐన నేత్రదానం చేయవచ్చు అంటే కేవలం ఎయిడ్స్ , పచ్చ కామెర్లు, రాబిస్ (కుక్క కాటు ) మినహా మిగతా ఏ కారణం తో మరణించినా నేత్రదానం చేయవచ్చు .
- ఒకవేళ నేత్రదాత accident వంటి పోలీసు కేసు సందర్బాలలో పోలీసు సమక్షం లో మాత్రమే నేత్రాలను దానం చేయాలి. అందుకు ప్రతి పోలీసు వారు సహకరిస్తారు.
- నేత్రదానం చేయటానికి దాత మరణించిన శరేరాన్ని ఎక్కడకు తెసుకువేల్లనవసరం లేదు . మరణించిన తర్వాత దగ్గరలోని నేత్రనిదికి ఫోన్ చేస్తే వాళ్ళు నేత్రదాత ఇంటివద్దనే మరణించిన చోటనే నేత్రాలను స్వీకరిస్తారు.
- నేత్రదాత మరణించిన తర్వాత ఆ శరీరం నుండి 5ml రక్తాన్ని స్వీకరిస్తారు ఈ రక్తాన్ని పరీక్షించి ఎయిడ్స్ వంటి జబ్బులు ఎని లేవు అని తెలిసిన తర్వాతనే వేరొకరికి ఆ కళ్ళను అమరుస్తారు.
- నేత్రాలను స్వీకరించే ముందు నేత్రదాత ఇంటివద్ద డాక్టర్ మీ సంతకం (ఇష్టపూర్వకంగా మీరు దానం చేస్తున్నట్లు ) తెసుకుంటారు.
- నేత్రదానం చేయాలి అనుకుంటే అందుకు దగ్గరలో ఉన్న నేత్రనిధి కి వెళ్లి మీ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఈ కార్డు మీదగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే మీ ఇంటిలోని వాళ్ళు దురప్రాంటలలో (ఉదాహరణకు మీరు హైదరాబాద్ లో ఉంటూ మీ ఇల్లు ఒంగోలు లో ఉంటె ) ఉంటె వాళ్ళు వచ్చి సంతకం (6 గంటలలోనే నేత్రాలను స్వీకరించాలి ) చేయటం కుదరదు కాబట్టి ఈ కార్డు ఉంటె ఇక్కడే మీ parents అనుమతి లేకపోయినా సమయం మించిపోకుండా నేత్రాలను స్వీకరిస్తారు
cornea : cornea అనేది మన కంటిమీద ఉండే ఒక పొర కంటిలోకి కాంతికిరణాల పోవాలంటే ఈ పొర గుండా మాత్రమే కంటిలోపలకు పోతాయి . మన శరీరం లో ఏ అవవయం పడిపోయినా ఆపరేషన్ చేసి బాగుచేయవచ్చు కానీ కేవలం liver (కాలేయం ) మరియు cornea చెడిపోతే ఏమి చేయలేము కేవలం వేరొకరు దానం చేస్తేమత్రమే తిరిగి చూపు పొందటానికి మార్గం అందుకు నేత్రదానం ఒక్కటే మార్గం .- కంటిలో సహజ అద్దం చెడిపోతే ఆపరేషన్ చేసి కృత్రిమ అద్దాన్ని అమరుస్తారు కానీ ఈ cornea చెడిపోతే ఏమి చేయలేము ఖచితంగా మరొకరి cornea మార్పిడి చేసి చూపు తెప్పిస్తారు .
- మన శరీరం రో అన్ని అవయవాలు oxygen (ప్రాణ వయవు ) ను రక్తం ద్వార స్వీకరిస్తాయి కానీ ఈ cornea ఒక్కటే నేరుగా గాలి నుండి oxygen ను స్వీకరిస్తుంది. అందుకే నేత్రదాత మరణించిన వెంటనే అన్ని అవయవాలు చనిపోతే కేవలం ఈ కళ్ళు మాత్రం 6 గంటల వరకు గాలి లోని oxygen ను స్వీకరిస్తూ బ్రతికి ఉంటాయి . ఈ ఆరు గంటల సమయం లో eyebank వాళ్ళు నేత్రాలను స్వీకరిస్తారు .
cornea remove |
eyebank card sing and address |
eyebank card |
Cornea |
- మరికొన్ని నిజాలు:
kannappa eye donation |
- నేత్రదానం మరియు అవయవదానం ను అన్ని మతాలు ఆమోదించాయి . పురాణాలలో శివునికి కన్నప్ప Eye donation తో చూపు తెప్పించారు.
- అలాగే కర్ణుడు మరణించేటప్పుడు తన పంటిని దానం చేసి మరణిస్తాడు అలాగే ఇచ్చిన మాటకోసం సిబి చక్రవర్తి తన అవయవాలను అన్ని దానం చేసారు .
- అలాగే ఏసుప్రభు మరణించేటప్పుడు తన Blood donation చేసి మరణించాడు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎందఱో మహనీయులు ఉన్నారు.
- ఈ నేత్రదానం పాతకాలం లో ఉన్నట్లయతే ఇప్పటికి ఇది మన భారత సంప్రదాయం అయిఉండేది. అందుకే ఇప్పుడయినా సరే నేత్రదానం మన సంప్రదాయం గా మార్చుకుoదాము.
మీకు దగ్గరలోని నేత్రనిధి కేంద్రాలు : మీకు దగ్గరలోని eyebank యొక్క చిరునామా కోసం క్రింది అడ్రస్ ను సంప్రదించండి
Eye bank association of India,
Plot no 12, BNR colony,
Road no 14, banjarahills,
Hyderabad - 500034
Phone: 040 23545454, 23544504
Fax: 040 23545454
Website: www.ebai.org
E-mail: ebai@vsnl.net, admin@ebai.org
ఇక్కడ కొన్ని మాత్రమే పెడుతున్నాను కొన్ని రోజుల తర్వాత అన్ని eyebank సెల్ నెంబర్ లు పెడతాను.
Eye Banks in Andhra Pradesh
Eyebank address | Phone number |
Eye bank association of India, plot no.12,BNR colony,Road no 14,Banjara hills,Hyderabad-500034. | 040-23544504 |
L.v.prasad eye institute,l.v.prasad marg,road no .2,banjara hills,Hyderabad-500034 | 040-30612512 |
Sarojini devi eye hospital,t.l.kapadia eye bank,humayun nagar,Hyderabad-500028 | 040-23317274 |
Dr.smita sriman memorial eye bank,kothapet main road,Guntur-522001 | 0863-2220028 |
Srikiran institute of opthalmology,apsp camp,Kakinada-533005 | 0884-2306301 |
Arvind eye bank,venkataratnam street,suryaraopet,Vijaywada-520002 | 0866-2433018, +91-9866433018 |
Swetcha gora eye bank,c/o vasaya mahila mandali,benz circle,viyaywada-520010 | 0866-2472370 |
Modern eye hospital,16-11-101,Beside venkata ramana hotel,Pogathota-524001 | 0861-2324868 |
The khammam eye bank,near munneru bridge,khammam | 08742-223756 |
Aluri Eye Hospital, RTC Bus stop, Kurnool Road, Ongole -1
| 08592-233767 |
మీ ప్రశ్నలు మా సమాధానాలు
నేత్రదానం చేసిన తర్వాత ఆ కళ్ళు ఏమి చేస్తారు.?
- మీరు నేత్రదానం చేసిన తర్వాత ఆ కళ్ళను ఒక చిన్న బాటిల్ లో (ఈ కళ్ళు చెడిపోకుండా 72 గంటలపాటు చూస్తాయి ) ఉంచి ఆ రక్తదాత శరీరం నుండి స్వీకరించిన రక్తాన్ని మరియు ఆ కళ్ళను హైదరాబాద్ లో ఉండే రామాయమ్మ international eye bank కు పంపుతారు అక్కడ అన్ని పరిక్షలు జరిపి అదే ఆసుపత్రిలో waiting లో ఉన్న అందరికి వరుస క్రమం లో నేత్రాలను అమరుస్తారు. మన రాష్ట్రము లో ఏ eyebank ఐన అది చిరంజీవి eyebank ఐన మరి ఏ eyebank అయినా కేవలం ఆ cornea స్వీకరించి ఇక్కడకు పంపుతారు అంతే. అంతేకాని రక్తదానం లాగా ఇక్కడ తీసి అదే ఆసుపత్రిలో మరొకరికి పెట్టరు.
నేతదనం చేసినందుకు మాకు ఎంతకు ఇస్తారు? మీరు ఎంతకు అమ్ముకుంటారు?
- నేత్రదానం చేసిన తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు వీరు ఒక్క రూపాయి కి కూడా అమ్ముకోరు ఎందుకంటే ఉదాహరణకు మీరు నేత్రదానం చేసినందుకు మీకు 5000 /- ఇస్తాము అంటె ఆ డబ్బుకోసమే అనేకమంది వాళ్ళ ఇంటిలో పనికిరాని వాళ్ళని అవసరం లేవి వాళ్ళని చంపివేసి వారి కళ్ళను దానం చేసి ఆ డబ్బుతో జల్సాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు . అందుకే ఎవ్వరికి డబ్బులు ఇవ్వరు కానీ dalara foundation వంటి స్వచందసంస్థలు దహన సంస్కారాల నిమిత్తం (అది హత్య కాకపోతే ) పేదవారికి కొంత ఆర్ధిక సహాయం చేస్తారు. ఇక కళ్ళు హైదరాబాద్ లో ఆసుపత్రి లో అందరికి ఉచితంగా అమరుస్తారు.
- మీరు దగ్గరలో ఏ కంటి ఆసుపత్రి లో ఐన వెళ్లి మీ కంటిని పరీక్షా చేపించుకుంటే కేవలం మీకు నేత్రదానం ద్వార మాత్రమే చూపు రాగలదు అనుకుంటే ఆ డాక్టర్ హైదరాబాద్ లో ని L V Prasad కంటి ఆసుపత్రి కు వెళ్ళమని ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ తెసుకొని అక్కడ చూపించుకుంటే మిమ్మల్ని లిస్టు లో వ్రాసుకుంటారు . ఆ తర్వాత మీరు ఇంటిదగ్గర ఉన్నప్పుడు కొన్నాళ్ళకు (నేత్రదానం ద్వార కళ్ళు వచ్చిన తర్వాత ) మీకు ఫోన్ చేసి చెప్తారు అప్పుడు మీరు ఆ హాస్పిటల్ కు వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉండనిస్తారు అప్పుడు కళ్ళు రాగానే మీకు అమరుస్తారు. మీకు ఒక్క కన్ను మాత్రమే అమరుస్తారు. మీకు తెల్ల resen card ఉంటె ఉచితంగాను లేకపోతె ఇక్కడ ఉన్నందుకు (ఆపరేషన్ కు కళ్ళకు కాదు ) రూం రెంట్ క్రింద కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
- మొదట మీ ఇంటిదగ్గర నేత్రాలను స్వీకరించిన తర్వాత మీకు వాళ్ళు నేత్రాలను స్వీకరించినట్లు ఒక కార్డు ఇస్తారు. మీరు నేత్రదానం చేసినతర్వాత కొన్ని రోజులకు eyebank నుండి (మీరు నేత్రదానం చేసినందుకు మిమ్మల్ని అభినన్దిస్తూ) hyderabad లోని రామాయమ్మ international eyebank నుండి ఒక certificate పంపుతారు (ఈ కార్డు మీకు మరణ ధృవీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది). ఈ లెటర్ అందినది అంటె మీకు ఏవిధమైన అవినీతి జరగలేదు అని అర్ధం . ఇంతవరకు భారతదేశం లో కనీసం ఒక్క eyebank మీద కూడా ఒక్క పోలీసు కేసు నమోదు కాలేదు (ఇటివల జీవిత రాజశేకర్ గారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు మీద కేసు వేసారు కానీ eyebank మీద కాదు ).
- ఇది మీ మానవత్వ్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటె ఒక్కసారి ఈ గణాంకాలను గమనించండి.
- భారతదేశం లో దాదాపుగా 25 లక్షలమంది cornea అంధత్వం తో బాధపడుతున్నారు. వాళ్ళకు కేవలం నేత్రదానం ద్వార మాత్రమే చూపు వస్తుంది. మన రాష్ట్రము లో దాదాపు 2 లక్షలకు పైగా cornea అంధత్వం గల వారు ఉన్నారు. వారికీ కేవలం నేత్రదానం వాళ్ళ మాత్రమే చూపు రాగలదు . కానీ గత మూడు సంవస్తరాల నుండి కేవలం 1972 , 2034 ,2118 నేత్రాలు మాత్రమే స్వీకరించారు. అలాగే మన రాష్ట్రము లో దీపావళి హోలీ వంటి పండగల సమయం లో మరియు ఇతర ప్రమాదాలలో సంవస్తారానికి కనీసం 2000 కు పైగా అంధులు అవుతున్నారు . కాబట్టి నేత్రదానం ను ఇంకా అధికంగా చేపించాల్సిన అవసరం ఉంది.
అంధులు ఎంత బాధపడుతుంటారు ? ఈ ఒక్క పరీక్షా చేయండి.
అమ్మ నువ్వు ఎలా ఉంటావు? |
మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని నిద్రపోకుండా ఒక్క అర్ధగంట కళ్ళు తెరవకుండా కూర్చోండి చాలు. నేను మీకు గోల్డ్ మెడల్ ఇప్పిస్తాను. ఎందుకంటే మన మనస్సు చీకటిని ఎక్కువసేపు భరించలేదు మనం కేవలం ఎటు నడవకుండా ఒక్క అర్ధగంట కూర్చోవటానికి ఇంత బాధపడుతుంటే మరి అంధులు కళ్ళు లేకుండా సంవస్తరాలు సంవస్తారాలు పోట్టకుటికోసం కష్టపడుతుంటే వాళ్ళు ఎంత బాధపడుతుంటారో ఒక్కసారి ఆలోచించండి.
మట్టిలో కలిసే కళ్ళకు మరోజన్మనివ్వండి-
నేత్రదానం చేయండి చేపించండి.
- అస్తమించే సూర్యుడు ఈ లోకాన్ని విడిచి పోయముందు తన కాంతిని చంద్రుడుకి ఇచ్చి అస్తమిస్తాడు . అదే ప్రక్రుతి మనకు చెప్పే సత్యం. మీ యొక్క కళ్ళు ఇద్దరి జీవితాలలో వెలుగు నింపుతుంది. ఆలోచించండి నేత్రదానం చేయండి చేపించండి. చేసేవారికి ఈ సమాచారం ఇవ్వండి.
sun gave life to moon |
ఇట్లు
వేణు
9247159150
www.bigdataanalyst.in
No comments:
Post a Comment