Monday, December 12, 2011

Eye donation - నేత్రదానం కొన్ని నిజాలు

నేత్రదానం
మన దేశం లో నేత్రదానం చేయకపోవటం వల్ల నష్టాలు జరగటం లేదు . కానీ నేత్రదానం మీద సంపూర్ణ అవగాహన లేకపోవటం వల్ల ఎక్కువ అనర్దాలు జరుగుతున్నాయి. ఎందుకంటే నేత్రదానం చేయకపోతే ఇప్పుడు మాత్రమే నష్టం కానీ దాని గురించి తెలుసుకోక పొతే మళ్ళి వచ్చే తరం ఆ తర్వాత తరం అన్ని అలాగే ఉంటాయి కాబట్టి తర తరాలు నష్టం కలగటానికి ఇది ప్రధాన కారణం అందుకు అందరికి అవగాహన కలిగించాలి అని నా ప్రయత్నం లో భాగమే ....
  •  అన్నదానం, విద్యాదానం, శ్రమదానం, కన్యాదానం, రక్తదానం ఇలా ప్రపంచం లో ఎన్నో రకాల దానాలు ఉన్నాయి కానీ స్వార్ధం అంటూ ఎరుగని ఎకైక దానం నేత్రదానం.
  • నేత్రదానం అనేది 1 సంవత్సరం నుండి వందసంవత్సరాల పైబడినవారు కూడా చేయగల ఏకైక దానం నేత్రదానం.
  • cornea remove
  • నేత్రదానం  అంటే కళ్ళు మొత్తం స్వీకరించరు కేవలం కంటి పైన గల cornea అనే ఒక్క పొర మాత్రమే స్వీకరిస్తారు. నేత్రదానం తర్వాత కళ్ళు తెయ్యకమునుపు వలె మాములు గా ఉంటాయి .
  • నేత్రదానం చేయటానికి ప్రత్యేకమైన అర్హతలు ఏమి లేవు ఆరు నెలల నుండి 100 సంవస్తరాలకు పైబడి ఉన్న వాళ్ళు, ఆపరేషన్ చేసిన కళ్ళు గల వాళ్ళు సుక్లాలు ఉన్నవారు  సైతం నేత్రదానం చేయవచ్చు.   నేత్రదాత మరణించిన తర్వాత దగ్గరలోని నేత్రనిదికి ఫోన్ చేస్తే చాలు.  ఒక నేత్రదాత కళ్ళను ఇద్దరు అందులకు అమరుస్తారు
  • నేత్రాలను నేత్రదాత మరణించిన  6 నుండి 8 గంటలలోపు మాత్రమే నేత్రాలను స్వేకరించావాలను అందుకు నేత్రదాత మరణించిన వెంటనే దగ్గరలోని eyenank కు సమాచారం ఇవ్వాలి.
  • కారణాలు ఏమైనా ఎలాంటి పరిస్తుతులలో ఐన నేత్రదానం చేయవచ్చు అంటే కేవలం ఎయిడ్స్ , పచ్చ కామెర్లు, రాబిస్ (కుక్క  కాటు ) మినహా మిగతా ఏ కారణం తో మరణించినా నేత్రదానం చేయవచ్చు .
  • ఒకవేళ నేత్రదాత accident వంటి పోలీసు కేసు సందర్బాలలో పోలీసు సమక్షం లో మాత్రమే నేత్రాలను దానం చేయాలి. అందుకు ప్రతి పోలీసు వారు సహకరిస్తారు. 
  • నేత్రదానం చేయటానికి దాత మరణించిన శరేరాన్ని ఎక్కడకు తెసుకువేల్లనవసరం లేదు . మరణించిన తర్వాత దగ్గరలోని నేత్రనిదికి ఫోన్ చేస్తే వాళ్ళు  నేత్రదాత ఇంటివద్దనే మరణించిన చోటనే నేత్రాలను స్వీకరిస్తారు.
  • నేత్రదాత మరణించిన తర్వాత ఆ శరీరం నుండి 5ml రక్తాన్ని స్వీకరిస్తారు ఈ రక్తాన్ని పరీక్షించి ఎయిడ్స్ వంటి జబ్బులు ఎని లేవు అని తెలిసిన తర్వాతనే వేరొకరికి ఆ కళ్ళను అమరుస్తారు.
  • నేత్రాలను స్వీకరించే ముందు నేత్రదాత ఇంటివద్ద డాక్టర్ మీ సంతకం (ఇష్టపూర్వకంగా మీరు దానం చేస్తున్నట్లు ) తెసుకుంటారు.
  • eyebank card sing and address
    eyebank card
  • నేత్రదానం చేయాలి అనుకుంటే అందుకు దగ్గరలో ఉన్న నేత్రనిధి కి వెళ్లి మీ పేరు నమోదు చేసుకుంటే వాళ్ళు ఒక గుర్తింపు కార్డు ఇస్తారు ఈ కార్డు మీదగ్గర ఎల్లప్పుడూ ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే మీ ఇంటిలోని వాళ్ళు దురప్రాంటలలో (ఉదాహరణకు మీరు హైదరాబాద్ లో ఉంటూ మీ ఇల్లు ఒంగోలు లో ఉంటె ) ఉంటె వాళ్ళు వచ్చి సంతకం (6 గంటలలోనే నేత్రాలను స్వీకరించాలి ) చేయటం కుదరదు కాబట్టి ఈ కార్డు ఉంటె ఇక్కడే మీ parents అనుమతి లేకపోయినా సమయం మించిపోకుండా నేత్రాలను  స్వీకరిస్తారు

  • cornea : cornea అనేది మన కంటిమీద ఉండే ఒక  పొర కంటిలోకి కాంతికిరణాల పోవాలంటే ఈ పొర గుండా మాత్రమే కంటిలోపలకు పోతాయి  . మన శరీరం లో ఏ అవవయం పడిపోయినా ఆపరేషన్ చేసి బాగుచేయవచ్చు కానీ కేవలం liver (కాలేయం ) మరియు cornea చెడిపోతే ఏమి చేయలేము కేవలం వేరొకరు దానం చేస్తేమత్రమే తిరిగి చూపు పొందటానికి మార్గం  అందుకు నేత్రదానం ఒక్కటే మార్గం .
  • Cornea
  • కంటిలో సహజ అద్దం చెడిపోతే ఆపరేషన్ చేసి కృత్రిమ అద్దాన్ని అమరుస్తారు కానీ ఈ cornea చెడిపోతే ఏమి చేయలేము ఖచితంగా మరొకరి cornea మార్పిడి చేసి చూపు తెప్పిస్తారు . 
  • మన శరీరం రో అన్ని అవయవాలు oxygen (ప్రాణ వయవు ) ను రక్తం ద్వార స్వీకరిస్తాయి కానీ ఈ cornea ఒక్కటే నేరుగా గాలి నుండి oxygen ను స్వీకరిస్తుంది. అందుకే నేత్రదాత మరణించిన వెంటనే అన్ని అవయవాలు చనిపోతే కేవలం ఈ కళ్ళు మాత్రం 6 గంటల వరకు గాలి లోని oxygen ను స్వీకరిస్తూ బ్రతికి ఉంటాయి .  ఈ ఆరు గంటల సమయం లో eyebank వాళ్ళు నేత్రాలను స్వీకరిస్తారు . 
  •  
    మరికొన్ని నిజాలు:
kannappa eye donation
    నేత్రదానం మరియు అవయవదానం ను అన్ని మతాలు ఆమోదించాయి . పురాణాలలో శివునికి కన్నప్ప Eye donation తో చూపు తెప్పించారు.
    అలాగే కర్ణుడు మరణించేటప్పుడు తన పంటిని దానం చేసి మరణిస్తాడు అలాగే ఇచ్చిన మాటకోసం సిబి చక్రవర్తి తన అవయవాలను అన్ని దానం చేసారు . 
    అలాగే ఏసుప్రభు మరణించేటప్పుడు తన Blood donation చేసి మరణించాడు. ఇలా చెప్పుకుంటూ పొతే ఎందఱో మహనీయులు ఉన్నారు. 
    ఈ నేత్రదానం పాతకాలం లో ఉన్నట్లయతే ఇప్పటికి ఇది మన భారత సంప్రదాయం అయిఉండేది. అందుకే ఇప్పుడయినా సరే నేత్రదానం మన సంప్రదాయం గా మార్చుకుoదాము.

     మీకు దగ్గరలోని నేత్రనిధి కేంద్రాలు : మీకు దగ్గరలోని eyebank యొక్క చిరునామా కోసం క్రింది అడ్రస్ ను సంప్రదించండి
Eye bank association of India,
Plot no 12, BNR colony,
Road no 14, banjarahills,
Hyderabad - 500034
Phone: 040 23545454, 23544504
Fax: 040 23545454
Website: www.ebai.org
E-mail: ebai@vsnl.net, admin@ebai.org

ఇక్కడ కొన్ని మాత్రమే పెడుతున్నాను కొన్ని రోజుల తర్వాత అన్ని eyebank సెల్ నెంబర్ లు పెడతాను.
Eye Banks in Andhra Pradesh
Eyebank address Phone number
Eye bank association of India, plot no.12,BNR colony,Road no 14,Banjara hills,Hyderabad-500034. 040-23544504
L.v.prasad eye institute,l.v.prasad marg,road no .2,banjara hills,Hyderabad-500034 040-30612512
Sarojini devi eye hospital,t.l.kapadia eye bank,humayun nagar,Hyderabad-500028 040-23317274
Dr.smita sriman memorial eye bank,kothapet main road,Guntur-522001 0863-2220028
Srikiran institute of opthalmology,apsp camp,Kakinada-533005 0884-2306301

Arvind eye bank,venkataratnam street,suryaraopet,Vijaywada-520002 0866-2433018, +91-9866433018
Swetcha gora eye bank,c/o vasaya mahila mandali,benz circle,viyaywada-520010 0866-2472370
Modern eye hospital,16-11-101,Beside venkata ramana hotel,Pogathota-524001 0861-2324868
The khammam eye bank,near munneru bridge,khammam 08742-223756
Aluri Eye Hospital, RTC Bus stop, Kurnool Road, Ongole -1

08592-233767




మీ ప్రశ్నలు మా సమాధానాలు

నేత్రదానం చేసిన తర్వాత ఆ కళ్ళు ఏమి చేస్తారు.?
  • మీరు నేత్రదానం చేసిన తర్వాత ఆ కళ్ళను ఒక చిన్న బాటిల్ లో (ఈ కళ్ళు చెడిపోకుండా 72 గంటలపాటు చూస్తాయి ) ఉంచి ఆ రక్తదాత శరీరం  నుండి స్వీకరించిన రక్తాన్ని మరియు  ఆ కళ్ళను హైదరాబాద్ లో ఉండే రామాయమ్మ international eye bank కు పంపుతారు అక్కడ అన్ని పరిక్షలు జరిపి అదే ఆసుపత్రిలో waiting లో ఉన్న అందరికి వరుస క్రమం లో నేత్రాలను అమరుస్తారు. మన రాష్ట్రము లో ఏ eyebank ఐన అది చిరంజీవి eyebank ఐన మరి ఏ eyebank అయినా కేవలం ఆ cornea స్వీకరించి ఇక్కడకు పంపుతారు అంతే. అంతేకాని రక్తదానం లాగా ఇక్కడ తీసి అదే ఆసుపత్రిలో మరొకరికి పెట్టరు.   


నేతదనం చేసినందుకు మాకు ఎంతకు ఇస్తారు? మీరు ఎంతకు అమ్ముకుంటారు?
  • నేత్రదానం చేసిన తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు వీరు ఒక్క రూపాయి కి కూడా అమ్ముకోరు ఎందుకంటే ఉదాహరణకు మీరు నేత్రదానం చేసినందుకు మీకు 5000 /- ఇస్తాము అంటె ఆ డబ్బుకోసమే అనేకమంది వాళ్ళ ఇంటిలో పనికిరాని వాళ్ళని అవసరం లేవి వాళ్ళని చంపివేసి వారి కళ్ళను దానం చేసి ఆ డబ్బుతో జల్సాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు . అందుకే ఎవ్వరికి డబ్బులు ఇవ్వరు కానీ dalara foundation వంటి స్వచందసంస్థలు దహన సంస్కారాల నిమిత్తం (అది హత్య కాకపోతే ) పేదవారికి కొంత ఆర్ధిక సహాయం చేస్తారు. ఇక కళ్ళు హైదరాబాద్ లో ఆసుపత్రి లో అందరికి ఉచితంగా అమరుస్తారు. 
నాకు కళ్ళు కనబడవు నేను నేత్రదానం ద్వార చూపు తెప్పించుకోవాలి అనుకుంటున్నాను ఎలా apply చేయాలి ?
  • మీరు దగ్గరలో ఏ కంటి ఆసుపత్రి లో ఐన వెళ్లి మీ కంటిని పరీక్షా చేపించుకుంటే కేవలం మీకు నేత్రదానం ద్వార మాత్రమే చూపు రాగలదు అనుకుంటే ఆ డాక్టర్ హైదరాబాద్ లో ని L V Prasad కంటి ఆసుపత్రి కు వెళ్ళమని ఒక లెటర్ ఇస్తారు ఆ లెటర్ తెసుకొని అక్కడ చూపించుకుంటే మిమ్మల్ని లిస్టు లో వ్రాసుకుంటారు . ఆ తర్వాత మీరు ఇంటిదగ్గర ఉన్నప్పుడు కొన్నాళ్ళకు (నేత్రదానం ద్వార కళ్ళు వచ్చిన తర్వాత ) మీకు ఫోన్ చేసి చెప్తారు అప్పుడు మీరు ఆ హాస్పిటల్ కు వెళ్లి కొన్ని రోజులు అక్కడ ఉండనిస్తారు అప్పుడు కళ్ళు రాగానే మీకు అమరుస్తారు. మీకు ఒక్క కన్ను మాత్రమే అమరుస్తారు. మీకు తెల్ల resen card ఉంటె ఉచితంగాను లేకపోతె ఇక్కడ ఉన్నందుకు (ఆపరేషన్ కు కళ్ళకు కాదు ) రూం రెంట్ క్రింద కొంత డబ్బులు కట్టాల్సి ఉంటుంది.  
ఇప్పుడు అన్ని రంగాలలో అవినీతి జరుగుతుంది మరి ఈ eyebank field లో జరగదు  అని guarantee ఏమిటి?
  • మొదట మీ ఇంటిదగ్గర నేత్రాలను స్వీకరించిన తర్వాత మీకు వాళ్ళు నేత్రాలను స్వీకరించినట్లు ఒక కార్డు ఇస్తారు.  మీరు నేత్రదానం చేసినతర్వాత కొన్ని రోజులకు eyebank నుండి (మీరు నేత్రదానం చేసినందుకు మిమ్మల్ని అభినన్దిస్తూ) hyderabad లోని రామాయమ్మ international eyebank నుండి ఒక certificate  పంపుతారు (ఈ కార్డు మీకు మరణ ధృవీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది). ఈ లెటర్ అందినది అంటె మీకు ఏవిధమైన అవినీతి జరగలేదు అని అర్ధం . ఇంతవరకు భారతదేశం లో కనీసం ఒక్క eyebank మీద కూడా ఒక్క పోలీసు కేసు నమోదు కాలేదు (ఇటివల జీవిత రాజశేకర్ గారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు మీద కేసు వేసారు కానీ eyebank మీద కాదు ). 
నేత్రదానం మేము ఎందుకు చేయాలి?
  •   ఇది మీ మానవత్వ్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటె ఒక్కసారి ఈ గణాంకాలను గమనించండి.
  • భారతదేశం లో దాదాపుగా 25 లక్షలమంది cornea అంధత్వం తో బాధపడుతున్నారు. వాళ్ళకు కేవలం నేత్రదానం ద్వార మాత్రమే చూపు వస్తుంది. మన రాష్ట్రము లో దాదాపు 2 లక్షలకు పైగా cornea అంధత్వం గల వారు ఉన్నారు. వారికీ కేవలం నేత్రదానం వాళ్ళ మాత్రమే చూపు రాగలదు . కానీ గత మూడు సంవస్తరాల నుండి కేవలం 1972 , 2034 ,2118 నేత్రాలు మాత్రమే స్వీకరించారు. అలాగే మన రాష్ట్రము లో దీపావళి హోలీ వంటి పండగల సమయం లో మరియు ఇతర ప్రమాదాలలో సంవస్తారానికి కనీసం 2000 కు పైగా అంధులు అవుతున్నారు . కాబట్టి నేత్రదానం ను ఇంకా అధికంగా చేపించాల్సిన అవసరం ఉంది.
చివ్వరగా ఒక్క మాట :
 అంధులు ఎంత బాధపడుతుంటారు ? ఈ ఒక్క పరీక్షా చేయండి.

అమ్మ నువ్వు ఎలా ఉంటావు?

మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని నిద్రపోకుండా ఒక్క అర్ధగంట కళ్ళు తెరవకుండా  కూర్చోండి చాలు. నేను మీకు గోల్డ్ మెడల్ ఇప్పిస్తాను. ఎందుకంటే మన మనస్సు చీకటిని ఎక్కువసేపు భరించలేదు మనం కేవలం ఎటు నడవకుండా ఒక్క అర్ధగంట కూర్చోవటానికి ఇంత బాధపడుతుంటే మరి అంధులు కళ్ళు లేకుండా సంవస్తరాలు సంవస్తారాలు పోట్టకుటికోసం కష్టపడుతుంటే వాళ్ళు ఎంత బాధపడుతుంటారో ఒక్కసారి ఆలోచించండి.
మట్టిలో కలిసే కళ్ళకు మరోజన్మనివ్వండి-
                      నేత్రదానం చేయండి చేపించండి.

    sun gave life to moon
  •  అస్తమించే సూర్యుడు ఈ లోకాన్ని విడిచి పోయముందు తన కాంతిని చంద్రుడుకి ఇచ్చి అస్తమిస్తాడు . అదే ప్రక్రుతి మనకు చెప్పే సత్యం. మీ యొక్క కళ్ళు ఇద్దరి జీవితాలలో వెలుగు నింపుతుంది. ఆలోచించండి నేత్రదానం చేయండి చేపించండి.  చేసేవారికి ఈ సమాచారం ఇవ్వండి.
నేను ఇటివల నేత్రదానం చేపించటం జరిగినది దానికోసం ఇక్కడ చుడండి 
ఇట్లు
వేణు
9247159150
www.bigdataanalyst.in

    Monday, December 05, 2011

    Judiciary Commission

    Judiciary Commission

    మన దేశం లో కెల్లా పరమ wrost రాష్ట్రాలు ఏమిటి అని ఎవ్వరిని అడిగితె మొదటే చెప్పేది Behar , ఉత్తర ప్రదేశ్ ఎందుకనగా అక్కడ ప్రధానంగా judiciary అనగా న్యాయవావస్థ  అనేది పరమ చండాలంగా ఉన్నది. భవిష్యత్ లో మన ఆంధ్ర కూడా మరొక బీహార్ లాగా అవుతుంది ఎందుకనగా
    1. న్యాయవ్యవస్థ చాల చాల ఆలస్యంగా ఉన్నది అనగా ఆమధ్య సుప్రేం కోర్ట్ judge K G Balakrishnan గారు  అన్నారు " ప్రస్తుతం ఉన్న విధానమే కొనసాగితే  ప్రస్తుతం ఉన్న 3  కోట్ల 80 లక్షల కేసు లను పూర్తి చేయటానికి కనీసం 320 సంవత్సరాలు అవుతుంది అని" అన్నారు
    2. ఎందుకనగా ఉదాహరణకు మన hyderabad లో ameerpet లో big bazar ప్రక్కన ఉన్న ఖాళీ స్తలం ఉన్నది అది గుంటగా తీసి ఆపివేసినట్లు ఉన్నారు . నేను దానిని గత  ఐదు సంవస్తరాలు క్రితం చూసాను . ఇప్పటికి అలాగే ఉంది ఎందుకు అని ప్రక్కవాళ్ళను  అడిగితె అది కోర్ట్ లో నడుస్తుంది అని అన్నారు. అంటే ఈ కేసు పూర్తి  కావాలంటే కనీసం మరొక 20 సంవత్సరాలు అవుతుంది . ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చిన్న కేసు ను పూర్తి చేయాలంటే అందుకు కనీసం 10  సంవత్సరాలు అవుతుంది . అంత ఎందుకు సాక్షాత్తు ACB redhanded  గ పట్టుకున్నా అది నిరూపించి వాయిదాలు పడి తేర్పు రావాలంటే కనీసం 5 సంవత్సరాలు అవుతుంది. అలాంటిది ఇలాంటి పెద్ద పెద్ద case పూర్తి కావాలంటే కనీసం 20 సంవత్సరాలు అవుతుంది. 
    3. అంతెందుకు దాదాపు నేను పుట్టినప్పుడు జరిగిన సంఘటన 1984 decembar 3 న BHOPAL లో MIC గ్యాస్ బయటకు లీక్ కావటం వాళ్ళ కొన్ని వేల మంది చనిపోయారు ఇప్పటికి కొన్ని లక్షలమంది అంతుచిక్కని వ్యాధులతో ఇప్పటికి బాధపడుతున్నారు . అప్పుడు court లో కేసు వేస్తె గత సంవస్తరం 2010 june 7 న అక్కడి కోర్ట్ తీర్పు ను ఇచ్చినది . అది మల్లి సుప్రేం కోర్ట్ కు వెళ్ళినది అక్కడ తీర్పు రావటానికి మరొక 25 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి ఈ బాధితులు అందరు చచిపోతారు .



      వాళ్ళు చచిపోయిన తర్వాత వాళ్ళకు నష్టపరిహారం ఇచి ఏమి ప్రయోజనం ? ఆ డబ్బు ను మల్లి వచ్చే జన్మకు deposit చేసుకుంటారా ? పైగా అప్పుడు ఆ లీక్ కు కారణం ఐన వాళ్ళు చాల వరకు చనిపోయారు . బ్రతికి ఉన్నవాళ్లు అందరు bail తెసుకొని బయట ప్రశాంతం గ ఉన్నారు . అంటే వాళ్ళకు శిక్ష పడేసరికి మరొక పాతిక సంవత్సరాలు పడుతుంది అప్పటికి వీళ్ళు అందరు నిందుతులు చనిపోతారు అప్పుడు ఆ చనిపోయినవారి శవాలను జైలు లో ఉంచుతారా?
    4. అంత ఎందుకు (ప్రక్క video లో చుడండి ) కేరళ లో ఎప్పుడో ఇరవయి సంవత్సరాల క్రితం ఒక మంత్రి కుంబకోణం జరిగితే అది 2011 febravary 19 తీర్పు  వచ్చి అతనుజైలు కు వెళ్ళాడు.  అది కూడా అప్పుడు ఒక సాదారణ సంగం కేసు వేస్తె అది ఇప్పటికి తేర్పు వచ్చినది అది కూడా ప్రతిపక్షం లో ఉన్న CM special court ఏర్పాటు చేసి త్వరగా చేయమన్నందుకు ఆ తేర్పు లేక పొతే అది మరొక 10 సంవత్సరాలు పడుతుంది అప్పటికి అతను చనిపోయి ఉండేవాడు .
    5. అంత ఎందుకు 24 feb 2010 న చీరాల MLA తమ్ముడు ఇలాంటి settlement చేస్తున్నాడు అని వీడియో సాక్షాలతో ఒకతను case వేసాడు  ఆ కేసు ఏమిటంటే అతను వాళ్ళ అన్న ఆస్థి సమస్య వాళ్ళ నాన్న 2 కోట్ల ఆస్తిని అన్నకే రాసి ఇచారు కాబట్టి ఆ తమ్ముడు స్తానికంగా ఉన్న MLA తమ్ముడి దగ్గరకు వెళ్లి settlement చేపించమని అడిగాడట ఆ MLA తమ్ముడు సెట్ట్లేమేంట్ చేస్తుంటే ఆ రెండుకోట్లు ఉన్న అన్న human rights ను ఆశ్రయించాడు . కానీ ఆ తీర్పు రావాలంటే కనీసం మరొక 20 సంవత్సరాలు అవుతుంది ఆ అన్న తమ్ముల ఆస్తుల కేసు ఐన ఈ settlement case ఐన.          
    6.  అంత ఎందుకు బోఫోర్స్ నుండి 2 G వరకు ఎన్ని కుంభకోణాలు   జరిగినాయి అందులో కనీసం ఒక్క కేసు లో ఐన తీర్పు వచ్చినదా? రాదు అంటే ఏమి జరుగుతుంది చేడువారికి శిక్ష పడటంలేదు మంచివారికి న్యాయం చాల చాల late గా జరుగుతుంది (అనగా ఒక ఇరవయ్ సంవస్తరాల తర్వాత ) అంత లేట్ గ న్యాయం జరిగినా అది అన్యాయమే అవుతుంది. మన రాజ్యాంగం 100 మంది దోషులు తప్పించుకున్న పర్వాలేదు కానీ ఒక్క నిర్దోసికి శిక్ష పడకూడదు అంటారు కానీ ఇప్పుడు అది తప్పు చేసినవాడికి bonus (bail తీసుకోని happy గ ఉండటం ) మంచివాడికి చాల చాల లేట్ గ న్యాయం లాగా ఉన్నది.    అందుకే అది భరించలేని అనేక మంది ప్రధానం గా బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో కోర్ట్ లో మనకు న్యాయం జరగటం లేదు అని వాళ్ళకు నచ్చిన న్యాయం వాళ్ళే చేస్తున్నారు . అందుకే అక్కడ నేను బీహార్ లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తున్నాను.
      బీహార్ లో నేను గమనించిన విషయాలు :
    7. అక్కడ ఎవరు కోర్ట్ కు వెళ్లరు ఎందుకు అంటే అక్కడకు వెళితే కనీసం 10 సంవత్సరాలు అవుతుంది అప్పటివరకు వాళ్ళు  వేచి ఉండలేరు. అందుకే అక్కడ రైతులు ఎవరైన పొలంలో  మోర్టర్ లో దొంగతనం చేస్తే అక్కడ కళ్ళు పీకివేయటం లేదా ఒక చెట్టుకు కట్టివేసి పైన ఉన్న తేనతోట్టే ను లేపి ఆ తేనటిగలు అతనిని కుట్టేలగా చేయటం . ఒక చేయి లేదా కాలు లేకుండా చేయటం వంటివి చేసారు. అది అక్కడ NYK వాళ్ళు నాకు చెప్పారు. అదే ఇక్కడ మన రాష్ట్రము లో ఐతే మహా ఐతే తిడతారు police station లో కేసు వేసినా ఆ దొంగ bail తెసుకొని దర్జాగా బయట తెరుగుతాడు
    8. బీహార్ లో ఈ టౌన్ లోనే ఒక అమ్మాయి దగ్గర లో ఉన్న MLA కొడుకు ను చంపివేసినది అంట ఎందుకు అంటే అతను (MLA కొడుకు ) ఆ అమ్మాయి ని రేప్ చేసాడంట ఆమె కోర్ట్ కు వెళ్ళితే వాడు bail తెసుకొని వస్తాడు మల్లి నాముందే తెరుగుతుంటే నేను భరించలేను అందుకే అతనిని చంపివేసి అదే bail ఆమె తెసుకొని ఇప్పుడు బయటకు తెరుగుతుంది . ఇంకా ఆ case పెండింగ్ లో ఉన్నది
    9. ఇలా కోర్ట్ లో లేట్ అవుతుందని ఒక బాధ ఐతే మరొక బాధ ఏమిటంటే దేనిని ఆసరాగా తెసుకొని కొన్ని మాఫియా లు అక్కడ గ్రామా గ్రామాన ఉన్నాయి అనగా బీహార్ లో ప్రతి గ్రామానికి ఒక్క settlement చేసేవాడు ఉంటాడు . అక్కడ court కు వెళ్ళకుండా ఈ settlement వదిదగ్గరకు వెళ్ళితే త్వరగా తీర్పు వస్తుంది . అని అందరు ఇతనిదగ్గరకు వస్తాడు అందుకు అతనికి 5 % నుండి 30 % commission తెసుకుంటాడు.
    10. ఉదాహరణకు పైన చెప్పిన ఆమంచి MLA settlement విషయం లో స్తలం విషయం కు వస్తే ఆ అన్న తమ్ముడు దగ్గరలో ఉండే settlement వాడి దగ్గరకు వెళితే అతను తీర్పు  చెప్తాడు అనగా ఆ స్తలం 2 కోట్లు అందులో 1 కోటి  అన్న కు 1 కోటి  తమ్ముడికి ఇస్తాడు( ఇదికాదు అంటే అన్నవాడి కొడుకు నో కూతురునో కిడ్నాప్ చేసి బెదిరించటం వంటివి మాములే) సెట్ట్లేమేంట్ చేసినందుకు అతనికి కనీసం 10 % అంటే అటు 10 % ఇటు 10 % మొత్తం కనీసం 20 లక్షలు settlement చేసినందుకు అతనికి వస్తాయి. ఆ డబ్బు తో ఆ settlement మాఫియా ఇంకా రేచిపోతుంది ఇలా బీహార్ లో ఈ settlement వ్యవస్థ మూడు పువ్వులు ముఫై కాయలు గ ఉన్నది మన ఆంధ్ర ఏమి తక్కువేమీ కాదు ప్రస్తుతం అన్ని మునిసిపల్ పట్టణాలలో స్తానిక MLA నో లేక MP నో ఎవరో ఒకరు సెట్ట్లేమేంట్ వాడు ఉంటాడు. నాకు తెలిసి హైదరాబాద్ లో ప్రతి గల్లి గాలికి వార్డ్  వార్డ్ కు ఒక settlement అతను ఒకడు ఉంటాడు అందుకు నేను guarentee .
    11. ఈ బీహార్ లో తెలివితేటలను చేడుకోసం ఉపయోగించుకుంటున్నారు  ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేక పోత్తకుటికోసం అనేకమంది వాళ్ళ తెలివితేటలను చేడుకోసం ఉపయోగించుతున్నారు . అనగా నేను ప్రత్యక్షం గ చూసినది . విన్నది నేను ఇక్కడ NYK ఆఫీసు లో ఎయిడ్స్ వాళ్ళు వస్తే అక్కడ విన్నాను ఇది . అక్కడ ఎవరిని ఐన చంపాలంటే పెద్దగ కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఐన చంపల్సివస్తే దగ్గరలోని settlement వాడికి చెప్తే చాలు ఆ సెట్ట్లేమేంట్ అతను ఒక ఎయిడ్స్ రోగిని పిలిపించి ఎవరిని ఐతే చంపాలో అతనిని చూపించి అతనిని  చంపితే నీకు ఒక లక్ష ఇస్తాను అంటే ఆ ఎయిడ్స్ రోగి ఎలాగో రేపో మాపో చచేవాడిని కదా వాడిని చంపితే ఈ డబ్బుతో మా ఇంట్లో పిల్లలు బాగుంటారు అని అతనిని చంపివేస్తాడు . ఒకవేళ అతనిమీద కేసు రుజువు ఐన అతనికి శిక్ష పడేసరికి 10 సంవత్సరాలు అవుతుంది అప్పటికి ఈ ఎయిడ్స్ రోగి చనిపోతాడు . ఇలా న్యాయం చాల లేట్ గ జరగటం వాళ్ళ వాళ్ళు కోర్ట్ కు వెళితే చాల లేట్ గ జరుగుతుందని ఇలా చెడు మర్గాలలోకి వెళుతున్నారు.   
    12. అందుకే బీహార్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఇవి మొత్తం ఆలోచించారు కాబట్టే అక్కడ పైన చెప్పినట్లు చంపుకోవటాలు చావటాలు చూడలేక తట్టుకోలేని వాళ్ళు అంతా ప్రక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఇవి నేను స్వయంగా బీహార్ లో వారం రోజులలో గమనించిన విషయాలు. ఇంకా నేను పూర్తిగా తెలుసుకోలేదు అక్కడ ఏమి జరుగుతున్నవో.
    13. krishna ayer
      justice venkatachalaiah
      JS Varma
    14. ఇక నేను పూర్తిగా తెలుసుకుందాం ఈ న్యాయ వ్యవస్థ గురించి అని ఆంధ్రకు వచ్చి తెల్సుకున్నాను ఈ judiciary వ్యవ్యస్థ గురించి . అందులో బాగంగా loksatta group లోని ప్రధాన సబ్యులు ఐన  justice venkatachalaiah గారు మరియు J S Verma గారు మరియు justice krishna iyer గారు  తయారుచేసిన judiciary commission ఒక్కటే మార్గం ఈ అన్ని సమస్యను తెర్చటానికి అని తెలుసుకున్నాను.ఎందుకు అనగా నేను గతం లో నే చెప్పాను మనం పోరాడాల్సింది వ్యవస్థ మీద అంటే కానీ వ్యక్తులమీద కాదు అని  ఈ bill లో కుడా అదే ఉన్నది అంటే న్యాయ వ్యవస్థ మీద పోరాడే bill ఇది

        ఈ bill కూడా janlokpall bill లో ఉన్నది. దీని ముక్యమైన ఉద్యేశ్యం సాదారణ case లు అన్ని 100 రోజులలో తీర్పు రావాలి. పెద్ద కేసులు అన్ని గరిష్టంగా 6 నెలలలో తీర్పు రావాలి లేటు అవుతున్నది అంటే అందుకు special court ను ఏర్పాటు చేయాలి. అవినీతి వంటి కేసు లలో సాద్యమైనంత త్వరగా తీర్పు రావటానికి special court (CBI అండ్ ACB కోర్ట్ లు ) లు ఏర్పాటు చేయాలి. అల చేస్తే గతం లో kg balakrishnan గారు అన్నట్లు  ప్రస్తుతం ఉన్న 3 కోట్ల 80 లక్షల case లు పూర్తిగా పరిష్కరించటానికి 320 సంవత్సరాలు అవసరం లేదు ఒక్క 5 సంవత్సరాలు చాలు. ఈ judiciary commission గురించి మరియు ప్రస్తుతన్యాయ వ్యవస్థ లోని మనకు ఉపయోగపడే మార్గాలు  నేను కొన్ని రోజులతర్వాత పోస్ట్ లో వ్రాస్తాను.

      ఇట్లు
    మీ Venu A+ve 22+

      Saturday, December 03, 2011

      facebook telugu - తెలుగు భాష లో వ్రాయటం ఎలా?



      చాల మంది facebook లో తెలుగు లో వ్రాస్తుంటారు. ఎలాగ వ్రాస్తారో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారికీ సహాయం చేయాలని నా ప్రయత్నం.

      మీరుక్రింది విధంగా అనుకరించండి.


      1.  మొదటిగా http://www.google.com/ime/transliteration/  అనే వెబ్సైటు నుండి అక్కడ మీ కంప్యూటర్ 32 bits or 64 bits computer అనేది మీరు తెలుసుకొని దానిమీద ఉన్న choose your IME language లో తెలుగు భాష ను స్వీకరించాలి. ఆ తర్వాత download google ime నొక్కండి
        Google IME download
        Vista లో :

      2. download చేసిన తర్వాత install  చేయండి. finish అయిపోయిన తర్వాత మీ కంప్యూటర్ లో controll pannel లో కి వెళ్లి clock, region and languages (vista లో) అనే option ఉంటుంది. దానిని click చేయండి.
        Control Panel Language


      3. Region and language
      4. తర్వాత region and language లోకి వెళ్ళండి. తర్వాత Keyboards and languages  chage keyboards ను నొక్కండి.
      5. Select shortcut key
      6. తర్వాత Text services and input languages లో advanced key settings లో క్రింద ఉన్న change key sequence ను నొక్కండి. తర్వాత ఆ change key sequence లో enable key sequence అనే checkbox ఉంటుంది.దానిని క్లిక్ చేస్తే key buttons enable అవుతాయి.
      7. తర్వాత మీకు సౌకర్యంగా ఉండే shortcut ను ఎంచుకోండి. అనగా ctrl + 1 ను ఎంచుకుంటే సాదారణంగా english లో ఉంటాయి మీకు తెలుగు కావాలి అంటే ctrl + 1 నొక్కండి. Aautometic గా తెలుగు వస్తుంది.
      8. Autometic గా మారటానికి Ctrl+G నొక్కండి అప్పుడు english బాషలోకి లేదా telugu భాషలోకి ఆటోమేటిక్ గ మారవచ్చు. 
      9. ఇకమీద  మీరు ఎక్కడ ఐన తెలుగు లో వ్రాయవచ్చు. అది microsoft word ఐనా notepad ఐనా website ఐనా facebook ఐనా మీరు వ్రాయొచ్చు.

      XP లో:
      విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి ఈ క్రింది steps లను పాటించండి.

      Step 1 :
      Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి


      Step 2:

      ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.





      Step 3:


      ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. ఇప్పుడు మీ మిషను reboot చేసి, మరలా మొదటి రెండు సోపానములను పాటించి, Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లండి. ఇక్కడ Text Services and input languages లోని details నొక్కండి.






      Step 4:

      క్రింది బొమ్మలో చూపిన విధంగా Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి. (advanced కూడా వెళ్లి విస్తా లో చెప్పినట్లు చేయవచ్చు)




      Step 5:

      Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.



      Step 6:



      మీరు తెలుగు లో వ్రాయాలి అంటే మాములు గ వ్రాయటమే. అంటే ఉదాహరణకు మీరు అమ్మ అని వ్రాయాలి అంటే amma అని వ్రాస్తే సరిపోతుంది. మీకు help గా దానికి సంబందించిన పదాలు కూడా కనబడతాయి. మీరు వ్రాసేటప్పుడు కుడి వైపున క్రింద గడియారం మీద ఏభాష లో ఉన్నామో autometic గ చూపిస్తుంది.. అది తెలుగు ఐతే అని english ఐతే చూపిస్తుంది.. మొదటిగా మీకు కొంచం ఇబ్బంది గా అనిపించినా ఒక నేల తర్వాత నుండి మీకు అంతా అలవాటు అవుతుంది.
          చివ్వరిగా ఒక్క మాట:
        ఈ పోస్ట్ చుసిన మీరు దయచేసి మీరు అందరికి forward చేయండి. ఎందుకనగా మీరు చెసే ఈ చిన్న పని వాళ్ళ మన తెలుగు యొక్క పునాది మరింత బలపడుతుంది. అందుకే దయచేసి అందరికి forward  చేయండి. 
        ఇట్లు
        వేణు A +ve 22+
        www.surajyam.org