Wednesday, February 22, 2006

అక్షరాభ్యాసం

తెలుగు అక్షరాలు ఎలా టైప్ చేయాలో తెలుసుకొని, ఎట్టకేలకు తెలుగు లో బ్లాగు రాయటము మొదలుపెట్టాను. చాలామంది ఔత్సాహికులు
ఇక్కడ తెలుగులో బ్లాగు రాస్తున్నారు. వివరాలకు http://telugubloggers.blogspot.com చూడండి.

ఈ బ్లాగును అక్షరమాల అనే 'tool' ఉపయోగించి రాస్తున్నాను. ఈ 'tool' ను http://aksharamala.com/Downloads/ నుండి పొందవచ్చు. కావలసిన తెలుగు పదాన్ని 'English' లో టైప్ చేస్తే, దానికి సరిసమానమయిన తెలుగు పదాన్ని ఈ 'tool' చూపిస్తుంది. ఉదాహరణకు, అమ్మ అని రాయాలంటే, 'amma' అని 'English' లో టైప్ చేయండి. ఈ పద్ధతినే 'transliteration' అంటారు.

తెలుగు అక్షరాలను అలా టైప్ చేయాలో వివరాలకు http://www.teluguworld.org/RIT/rts.html చూడండి.